27.2 C
Hyderabad

ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ  : ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని రుద్రూర్ తహసిల్దార్ తారాబాయి అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం రుద్రూర్ మండల కేంద్రంలోని తహాసిల్దార్ కార్యాలయం నుండి బస్టాండ్ ప్రాంగణం వరకు పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా తహసిల్దార్ తారాబాయి మాట్లాడుతూ.. ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఓటు హక్కు అనేది ప్రతి పౌరుని బాధ్యత అని ఆమె సూచించారు. అనంతరం తహాసిల్దార్ కార్యాలయం వద్ద మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహాసిల్దార్ సురేందర్ నాయక్, మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్, రెవెన్యూ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

The right to vote is like a diamond weapon

More articles

Latest article