ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది

రుద్రూర్, బతుకమ్మ  : ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని రుద్రూర్ తహసిల్దార్ తారాబాయి అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం రుద్రూర్ మండల కేంద్రంలోని తహాసిల్దార్ కార్యాలయం నుండి బస్టాండ్ ప్రాంగణం వరకు పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా తహసిల్దార్ తారాబాయి మాట్లాడుతూ.. ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఓటు హక్కు అనేది ప్రతి పౌరుని బాధ్యత అని ఆమె సూచించారు....