26.2 C
Hyderabad
Monday, August 3, 2026

నిజామాబాద్ లో తీగ లాగితే . . రాజస్థాన్ లో కదిలిన డొంక

Must read

📰 Generate e-Paper Clip

  • 35 టెలిగ్రామ్ యాప్ అకౌంట్ లు . . . 39 కేసులు
  • దేశ వ్యాప్తంగా సైబర్ క్రైం కోసం టెలిగ్రామ్ యాప్ అకౌంట్ల వినియోగం
  • ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు
  • ఇప్పటి వరకు 50 లక్షల మోసం చేసిన డబ్బులు దారి మళ్ళించినట్లు వెల్లడి

నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 4వ టౌన్ పరిధిలో ఈ నెల 14న నమోదైన సైబర్ క్రైం కేసు అంతర్ రాష్ట్ర సైబర్ క్రైం ముఠా ఆనవాళ్ళ గుట్టును విప్పింది. ఒక వ్యక్తి తన ఖాతా నుంచి లక్షా 8 వేల రూపాయలు తనకు తెలియకుండానే ఇతరుల ఖాతాకు మళ్లాయని తెలిసి పోలీస్ స్టేషన్ లో చేసిన ఫిర్యాదుతో నిజామాబాద్ లో కదిలిన డొంక రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని సైబర్ క్రైం ముఠా సంబంధాలను గుట్టురట్టు చేసిందని నిజామాబాద్ ఏసీపీ రాజవెంకట్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఏసీపీ తన చాంబర్ లో విలేకరులతో మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 4వ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఈ నెల 14న నమోదైన కేసు విషయంలో బోధన్ కు చెందిన నితీష్ ను అరెస్టు చేయగా అతని ద్వారా జిల్లా కేంద్రంలోని ఆటోనగర్ కు చెందిన అబ్దుల్ జావిద్ ను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద దొరికిన సమాచారంతో ఈ కేసు సైబర్ క్రైం ముఠాతో ముడిపడి ఉందని తేలిందన్నారు. ఇద్దరు వ్యక్తులు తమకు తెలిసిన వారి ద్వారా టెలిగ్రామ్ యాప్ లో పరిచయాలు పెంచుకుని తమకు టెలిగ్రామ్ యాప్ అకౌంట్ ఓపెన్ చేసుకుని తమకు బ్యాంక్ ఖాతా, ఆధార్, చెక్ బుక్ లు, ఏటీఎం, ఏటీఎం పిన్ నంబర్, సిమ్ కార్డు ఇస్తే నెలకు రూ.5 వేల నుంచి 10 వేలు చెల్లిస్తామని నమ్మించారని తెలిపారు. అదే కోవాలో 35 మంది నుంచి 5 బ్యాంకుల ద్వారా ఖాతాలు తెరిచారని తెలిపారు. వారి వద్ద తీసుకున్న ఖాతాల వివరాలను రాజస్థాన్ కు చెందిన కమల్, నౌషద్ అనే వ్యక్తులకు ఇచ్చారని తెలిపారు. సంబంధిత ఖాతాలకు వారితో పాటు ఉన్న సైబర్ క్రైం ముఠా 50 లక్షలు ఆయా ఖాతాలో వేసి విత్ డ్రా చేసుకున్నారని తెలిపారు. రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, నిజామాబాద్, బోధన్ లలో ఈ తరహా కేసులు 39 గుర్తించామని ఏసీపీ తెలిపారు. కేసు నమోదు కాగానే నిజామాబాద్ నగర సిఐ శ్రీనివాస్ రాజ్, 4వ టౌన్ ఎస్సై శ్రీకాంత్ లు కలిసి నితిష్, అబ్దుల్ జావిద్ లను అరెస్టు చేశారని వారితో పాటు మిగిలిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు అడిగితే ఆదార్ కానీ, బ్యాంక్ ఖాతాలు కానీ సోషల్ మీడియా యాప్ అకౌంట్లు ఇవ్వవద్దని ఏసీపీ తెలిపారు.

More articles

Latest article