బతుకమ్మ, కమ్మర్ పల్లి : కమ్మర్ పల్లి మండలం చౌటుపల్లి గ్రామానికి చెందిన రియన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ గడ్డం మహేందర్ రూ.95 వేలు విలువ చేసే సీసీ కెమెరాలను గ్రామానికి విరాళంగా అందించారు. సీసీ కెమెరాలను కమ్మర్ పల్లి ఎస్సై అనిల్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఎస్సై అనిల్ రెడ్డి మాట్లాడుతూ… సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా గ్రామానికి కొత్త వ్యక్తులు వచ్చిన, దొంగతనాలు జరిగిన ఈజీగా గుర్తించవచ్చని, నేరాల నియంత్రనతో పాటు,నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో కీలకమని అన్నారు.పుట్టిన ఊరు మీద ప్రేమతో ఎంతో విలువ చేసే సీసీ కెమెరాలనూ విరాళంగా అందించినందుకు గాను మహేందర్ ను గ్రామాబివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ స్పందన ,మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆంధ్రయ్య,గ్రామ కమిటీ అధ్యక్షులు కొమ్ముల రాజేందర్ రెడ్డి,ఉపాధ్యక్షులు శ్రీనివాస్,క్యాషియర్ రమేష్, నవీన్ గౌడ్ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

