నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల విద్యార్థులు పూజ, ఐశ్వర్య, నందిని గుంటూరు జిల్లా కొండవీడులో జనవరి 16 నుండి 23 వరకు నిర్వహించిన ట్రెక్కింగ్ క్యాంప్- 2025 ను విజయవంతంగా పూర్తి చేసుకొని శుక్రవారం కళాశాలకు చేరుకున్నారని ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామ్ మోహన్ రెడ్డి తెలిపారు. వీరికి ఎన్.సి.సి అధికారి లెఫ్టినెంట్ డాక్టర్ ఎం. రామస్వామి. అన్ని విభాగాల అధిపతులు, అధ్యాపక సిబ్బంది, కెడేట్లు శుభాకాంక్షలు తెలిపారు.

