27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

గ్రామసభలో అధికారులను నిలదీసిన గ్రామస్థులు

Must read

📰 Generate e-Paper Clip

రామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని రెడ్డి పేట గ్రామంలో గురువారం నిర్వహించిన గ్రామ సభలో గ్రామస్థులు అధికారులను నిలదీశారు. దీంతో గ్రమా సభలో గందరగోళ పరిస్థతి నెలకొంది. రూ. 30 వేల రుణమాఫీ కూడా ఎందుకు కాలేదని అధికారులను రైతులు ప్రశ్నించారు. గ్రామసభలో పాల్గొన్న ఎంపీడీవో, పంచాయతీ సెక్రెటరీని గ్రామస్తులు చుట్టుముట్టి ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, తులం బంగారం రుణమాఫీపై ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరకాలం దాటుతున్న ఇస్తామన్న పథకాలు ఎందుకు ఇవ్వడం లేదంటూ అధికారులను నిలదీశారు. గ్రామంలో అనేకమందికి రెండు లక్షల లోపు రుణమాఫీ కాలేదని అధికారులను ప్రశ్నించారు. రుణమాఫీ చేస్తామని చెప్పి ఎందుకు తప్పించుకుంటున్నారని అధికారులను నిలదీశారు. దరఖాస్తులు ఇవ్వమని అధికారులు చెప్తే అందుకు రైతులు నిరాకరించారు. ఎన్నిసార్లు దరఖాస్తులు తీసుకుంటారని అధికారులను ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలలో నిజమైన లబ్ధిదారుల పేర్లు రాలేదని సభలో ఆందోళనకు దిగారు.

More articles

Latest article