నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బ్రిటిష్ వలస పాలకుల నుండి భారత దేశ విముక్తి కోసం అహర్నిశలు కృషి చేసిన స్వాతంత్ర్య సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితమే నేటి యువతరానికి దిక్సూచి అని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ అన్నారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హల్ లో గురువారం బోస్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. బ్రిటిష్ పరాయి పాలన వద్దని,భారతదేశాన్ని ,భారత ప్రజలే పాలించుకుంటారని ఎలుగెత్తి చాటిన మహనీయుడని అన్నారు. బోస్ త్యాగానికి గుర్తుగా ప్రతి గ్రామ కూడలిలో విగ్రహం ఉండటమే నిదర్శమని జగన్ పేర్కొన్నారు. భారతమాత ముద్దుబిడ్డగా ఎన్నో త్యాగాలు చేసి చిరస్మరణీయుడిగా నిలిచారని అన్నారు. నేటితరం బోస్ ను ఆదర్శంగా తీసుకుని ఎదగాలని జగన్ కోరారు. కార్యక్రమంలో బార్ ఉపాధ్యక్షుడు రాజు,కార్యదర్శి దొన్పల్ సురేష్,కోశాధికారి దీపక్, లైబ్రరీ కార్యదర్శి పిల్లి శ్రీకాంత్ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుభేదార్ ,న్యాయవాదులు తులసీదాస్ మానిక్ రాజు,ఆశ నారాయణ ఉదయ్ గోవర్ధన్ మెట్టు నరేష్ నాగ సురేష్ రణదీశ్. అరటి నారాయణ అయూబ్ అహ్మద్ ,ఉదయ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
