సుభాష్ చంద్రబోస్ కు బార్ అసోసియేషన్ నివాళి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బ్రిటిష్ వలస పాలకుల నుండి భారత దేశ విముక్తి కోసం అహర్నిశలు కృషి చేసిన స్వాతంత్ర్య సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితమే నేటి యువతరానికి దిక్సూచి అని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ అన్నారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హల్ లో గురువారం బోస్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. బ్రిటిష్ పరాయి పాలన వద్దని,భారతదేశాన్ని ,భారత ప్రజలే పాలించుకుంటారని ఎలుగెత్తి చాటిన...