25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

సర్వే జరిగినప్పుడు ఇందిరమ్మ ఇళ్లు వద్దని తిప్పి  పంపించా

Must read

📰 Generate e-Paper Clip

. . . ఇందిరమ్మ ఇళ్ళు అర్హత జాబితాలో చేర్చడంలో ఎవరిది లోపం?

. . . మాజీ కార్పొరేటర్ చామకూర విశాలినిరెడ్డి

నిజామాబాద్, బతుకమ్మ : 

ఇటీవల ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటింటి సర్వేలో భాగంగా మా ఇంటికి వస్తే ఇందిరమ్మ ఇళ్లు అక్కర్లేదని తిప్పి పంపించడం జరిగిందని మాజీ కార్పొరేటర్ విశాలినిరెడ్డి అన్నారు. ప్రజాపాలనలో భాగంగా బుధవారం అంబేద్కర్ వద్ద జరిగిన వార్డు సభలో అర్హతల జాబితాలో విశాలినిరెడ్డి పేరు  రావడంతో ఆమె స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో తెలంగాణ ఉద్యమకారులు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుంటే వారికి 250 గజాల ఇంటి స్థలంతో పాటు వారికి పెన్షన్ కూడా ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.  తెలంగాణ ఉద్యమకాలంలో నాపై పోలీసు కేసులు కూడా అయినాయి కాబట్టి ఒక తెలంగాణ ఉద్యమ కారిణిగా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నాను. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకోకపోయినా నా పేరును అందులో చేర్చిన తప్పిదాలు అధికారుల  నిర్లక్ష్యమే కారణమన్నారు.

More articles

Latest article