24 C
Hyderabad
Sunday, August 2, 2026

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు

Must read

📰 Generate e-Paper Clip

జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు

 

మద్నూర్, బతుకమ్మ: అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని మంగళవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. డోంగ్లీ మండలం ధోతి గ్రామంలో గ్రామసభలో ఈ నెల 26 నుండి ప్రభుత్వం అమలు చేయబోతున్న సంక్షేమ పథకాలు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. అనంతరం డోంగ్లీ మండల కేంద్రంలో లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి,  షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. తర్వాత మొఘ గ్రామంలో ధ్రువ ఆన్లైన్ షాప్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే తో పాటు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Welfare schemes for everyone who is eligible

More articles

Latest article