27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

షరతులు లేకుండా అమలు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మోర్తాడ్:  ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ రూ.2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తామని చెప్పి ఇప్పటికి 30 శాతం మందికే మాఫీ చేసి చేతులు దులుపుకొన్నారని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఏలియా అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఎన్నికల ప్రచారంలో దేవుళ్ల పై ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి ఇంకా 70 శాతం రైతులకు అడ్డగోలు నిబంధనలు పెట్టి రుణమాఫీ చేయకుండా అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి రైతు కు రూ. 2 లక్షల రుణమాఫీ షరతులు లేకుండా సంపూర్ణంగా అమలు చేయాలని,లేని పక్షాన బీ ఆర్ ఎస్ పార్టీ తరపున రైతులకు అండగా నిలిచి ప్రజా క్షేత్రంలో పోరాడుతామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపిపి శ్రీనివాస్, వైస్ ఎంపీపీ శ్రీనివాస్, రైతుబంధు అధ్యక్షుడు పర్స దేవన్న, జిల్లా నాయకులు సత్యనారాయణ, మండల నాయకులు తీగల సుభాష్, సందీప్, యూసుఫ్, రాజేశ్వర్, చిన్నారెడ్డి, ఆనంద్, శాస్ర్తీ,భూమారెడ్డి, దేవన్న, రాజేందర్, నవీన్, రోహిత్, సంజాయ్ దితరులు పాల్గొన్నారు.

More articles

Latest article