32.2 C
Hyderabad

బడి మానిన విద్యార్థిని బడిలో చేర్పించిన సిఆర్పి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ : నాగిరెడ్డిపేట : బడి మానివేసి ఇంటి దగ్గర ఉంటున్న విద్యార్థినిని గుర్తించి తిరిగి పాఠశాలలో చేర్పించినట్లు మండల విద్యాశాఖ సిఆర్పి రాజయ్య తెలిపారు. సిఆర్పి రాజయ్య తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మెల్ల కుంట తండా గ్రామానికి చెందిన లాకావత్ శంకర్ కూతురు లకావత్ సంధ్య 8వ తరగతిలో బడి మానివేయగా అమ్మాయిని గుర్తించి సోమవారం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో పాఠశాల ప్రిన్సిపాల్ గీత తో మాట్లాడి 8వ తరగతిలో చేర్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఆర్పి కృష్ణస్వామి, ఉపాధ్యాయినీలు ఉన్నారు.

More articles

Latest article