బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ఉన్నత పాఠశాల విద్యార్థులకు విద్యాశాఖ, ఎన్జీవో నిజామాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో అంటురోగాలపై సోమవారం అవగాహన సదస్సును నిర్వహించారు. యుక్త వయసులో ఉన్న బాల బాలికలకు ఎలాంటి వ్యాధులు ప్రబలుతాయో,విద్యార్థులు ముఖ్యంగా ఇలాంటి వ్యాధుల పట్ల ఎలాంటి అవగాహన కలిగి ఉండాలో తెలిపారు. ప్రత్యేకించి హెచ్ఐవి, ఎయిడ్స్, వ్యాధుల గూర్చి విద్యార్థులు తెలుసుకోవాలని కోర్సు డైరెక్టర్ మల్లికార్జున్, సరిత తెలిపారు. దీనిలో భాగంగానే విద్యార్థులకు క్విజ్ పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి, ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.
