. . .బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి..
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:
సిఎం రేవంత్ రెడ్డి ఎఫ్.అర్.బి.ఎం పరిధిని దాటి విపరీత అప్పులు చేస్తున్నారని , ఇన్ని అప్పులు చేసినప్పటికీ కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేక పోతున్నారని బిజేపి శాసన సభ పక్ష్ నేత ఏలేటీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. బిజెపి జిల్లా కార్యాలయం లో రాజ్యాంగ సంవిధాన గౌరవ ధివాస్ పై వర్క్ షాప్ సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతు….పసుపు బోర్డు దేశానికే గర్వకారణం అని ఇది సాధించిన ఎంపి ధర్మపురి అరవింద్ కు అభినందనలు తెలిపారు. 13 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో 13 కుంభ కోణాలు ఆధారాలతో సహా బయట పెట్టినా స్పందన లేదన్నారు. ప్రభుత్వ పాలన పూర్తి అవినీతి మయంగా మారిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ స్వార్థం కోసం పనిచేస్తే ,బిజెపి ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తుందన్నారు. దేశం, కోసం ధర్మం కోసం పని చేసే భాజపా కార్యాకర్తలు, నాయకులు భారత రాజ్యంగం పట్ల విశ్వాసం తో దాని రక్షణకు కట్టుబడి పనిచేస్తారని అన్నారు. ఈ వర్క్ షాప్ లో జిల్లా అధ్యక్షులు కులచారీ దినేష్, నాయకులు పోతన్ కర్ లక్ష్మి నారాయణ, స్రవంతి రెడ్డి, న్యాలం రాజు తదితరులు పాల్గోన్నారు.

