నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని ఆదర్శ్ నగర్ లో గల హింగులాంబికా మందిరానికి సంబంధించిన హింగులాంబికా సేవాసమితి అధ్యక్షురాలుగా విజయలత మైస్కర్ ఎన్నికయ్యారు. ఆదివారం స్థానిక మందిరంలో జరిగిన ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి పేండ్ కర్ రాజేంద్ర కుమార్ పై 57 ఓట్ల తేడాతో గెలుపొందారు. సభ్యత్వ నమోదు చేయించుకున్న మొత్తం 335 మంది ఓటర్లలో ఆదివారం 296 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలైన 296 ఓట్లలో ఒక ఓటు చెల్లకపోగా, 176 ఓట్లు విజయలత మైస్కర్ కి, 119 ఓట్లు రాజేంద్ర కుమార్ కి పోలయ్యాయి. విజేతగా నిలిచిన విజయలతకి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా కష్టకాలంలో తాను చేసిన సేవలను గుర్తించి తనని నమ్మి, ఓటేసి మూడు సంవత్సరాల పాటు హింగుళాంబికా సేవా సమితి అధ్యక్షురాలుగా సేవ చేసుకునే అదృష్టం కలిగించిన ఓటర్లకి ఆమె ధన్యవాదాలు తెలియజేస్తూ, అమ్మవారి ఆశీస్సులతో మందిరాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు.
