26.3 C
Hyderabad
Monday, August 3, 2026

భరోసా సెంటర్ ద్వారా మహిళలకు, బాలికలకు రక్షణ

Must read

📰 Generate e-Paper Clip

 భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి జూపల్లి

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:  నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ లైన్ లో రూ.2 కోట్ల ఖర్చుతో నిర్మించిన భరోసా కేంద్రాన్ని రాష్ట్ర ఎక్సైజ్, జిల్లా ఇంచార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. నిజామాబాద్  పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వద్ద భరోసా సెంటర్ ని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, డిజిపి జితేంధర్ తో కలిసి ప్రారంభించిన సందర్భంగా జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఈ సెంటర్ల ద్వారా మహిళలకు పూర్తి రక్షణ కల్పించే విధంగా సేవలు ఉంటా యన్నారు. మహిళలు ఈ సెంటర్‌ సేవలపై అవగాహన పెంచుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో భరోసా సెంటర్‌ నిర్మాణానికి రూ.2.10 కోట్లు వెచ్చిండం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ భరోసా కేంద్రం ద్వారా బాధిత మహిళలు, బాలికలకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నాం అన్నారు. భరోసా కేంద్రాలలో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు  నమోదు  అయినా పోక్సో కేసులు  అన్నింటికి కౌన్సెలింగ్ ఇప్పించి వారికి భరోసా కల్పిస్తున్నాం అన్నారు. బాధిత మహిళలకు నష్టపరిహారం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు బాలికలకు ఎప్పుడు లేనంత విధంగా భద్రత కల్పిస్తూ వారి సహాయం కోసం భరోసా సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నారు.

Protection of women and girls through Bharosa Centre

ఈ సందర్భంగా డిజిపి జితేందర్ మాట్లాడుతూ…  భరోసా సెంటర్లో ప్రొఫెషనల్ స్టాఫ్ 216 మంది పోలీస్ స్టాప్ 29, క్లినికల్ ఫీడ్బ్యాక్ కాల్ సెంటర్ లో 2 భరోసా పిఎంయు స్టాఫ్ 7 మెంబర్స్ ఎల్లవేళలా ప్రజలకు సేవ చేయడానికి అందుబాటులో ఉంటారని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6910 ఫోక్సో కేసులు, 1770 రేప్ కేసులు , గృహ హింస నిర్బంధ కేసులు మరి ఇతర కేసులు 11663 నమోదయ్యాయని తెలిపారు. ఇప్పటివరకు 290 మందికి శిక్ష విధించడం జరిగిందని అన్నారు. 4516 మంది బాధితులు నష్టపారిహారం  కొరకు వినతులు 2411 మందికి ఏడు కోట్ల 32 లక్షల 87 వేల రూపాయలు బాధితులకు నష్టపరిహారం అందించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర మొత్తంలో 28 భరోసా సెంటర్లో అందుబాటులో ఉన్నాయన్నారు. అందులో 10 శాశ్వత భవనాలు కాగా నిజామాబాద్ జిల్లాలో అందులో ఓక్కటి అన్నారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యేలు పోద్ధుటూరి సుధర్శన్ రెడ్డి, ధన్ పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఐజీ చంద్ర శేఖర్ రెడ్డి, ఇంచార్జీ సిపి  సింధూశర్మ తదితరులు పాల్గొన్నారు.

Protection of women and girls through Bharosa Centre

More articles

Latest article