27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మాక్లూర్ కు ఇంచార్జియే దిక్కు…!

Must read

📰 Generate e-Paper Clip

  • పరిషత్ కు ఏళ్లుగా లేని రెగ్యులర్ అధికారి
  • నేటితో శిక్షణ ఐఏఎస్ బాద్యతలు పూర్తి

 

నిజామాబాద్, బతుకమ్మ: మాక్లూర్ మండల్ పరిషత్ కు మళ్ళీ ఇంచార్జ్ అధికారే రాబోతున్నారు. ఏళ్ళుగా శాశ్వత అధికారి మాటను మండల ప్రజలు మరచిపోయారు. ప్రస్తుతం ఉన్న ఐఏఎస్ శిక్షణాదికారి విధులు నేటి(18 వతేది)తో ముగియనున్నాయి. అధికార స్థానం ఖాళీ ఉంచకూడదని భావించిన జిల్లా పరిషత్ అధికారులు మండల పరిషత్ లోని ఇద్దరి పేర్లను సూచిస్తూ తుది నిర్ణయం కోసం కలెక్టర్ చెంతకు ఫైల్ పంపినట్లు తెలిసింది.

  • ఇంచార్జియే దిక్కు …

గత కొన్నేళ్ళుగా ఇంచార్జ్ అధికారులతోనే మాక్లూర్ పరిషత్ ను నెట్టుకొస్తున్నారు. రెగ్యులర్ మండలాధికారి కామారెడ్డి నుంచి రాగా వారిని జక్రాన్ పల్లి కి డిప్యూటేషన్ పై పంపించారు. అక్కడ ఉన్న ఎంపీడిఓ ఇష్టత మేరకు ఇదంతా జరిగిందని పరిషత్ ఉద్యోగులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. మాక్లూర్ కు డిప్యూటేషన్ పై వచ్చిన ఎంపీడిఓ ఇదంతా తన సామ్రాజ్యమని భావించి పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు. నిదులను స్వాహా చేయడమే గాకుండా పరిషత్ లోని సిబ్బందిని ఇబ్బందులు పెడుతున్న విషయాలను “బతుకమ్మ” వెలుగులోకి తెచ్చింది. పరిస్థితులు చక్కబడితే మళ్ళీ యధాతదంగా నడిపించుకోవచ్చనే ఉద్దేశంతో ముందుగా 15 రోజులు సెలవులో వెళ్లారు. అనుకున్నవి తారుమారు కావడంతో విధుల్లో చేరినప్పటికి వాతావరణం బాగాలేదని దీర్ఘకాలిక సెలవులో వెళ్ళిపోయారు.

  • శిక్షణ ఐఏఎస్ కు భాద్యతలు..

ఉన్నతాధికారుల సూచన మేరకు అవినీతిలో పీకల్లోతుల్లోకి కూరుకుపోయి ఉన్న మాక్లూర్ డిప్యూటేషన్ ఎంపీడిఓ సెలవులో వెళ్ళిపోయారు. అంతలోనే శిక్షణ నిమిత్తం జిల్లాకు వచ్చిన ఐఏఎస్ అధికారికి అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు పరిషత్ బాద్యతలను కలెక్టర్ అప్పగించారు. గడువు సమీపిస్తున్న దరిమిలా మళ్ళీ జనవరి 18 వరకు పొడిగించారు. తన శిక్షణ పూర్తి కానుండడంతో బాద్యతలను తుంచేసుకొని జిల్లా నుంచి వెళ్ళిపోనున్నారు.

  • రెగ్యులర్ అధికారికై …

పరిషత్ కు శాశ్వత అధికారి కావాలని మండల ప్రజలు ఆశిస్తున్నప్పటికి వీరి కోరిక ఇంతటిలో నెరవేరేలా కనిపించడం లేదు. మండల పరిషత్ కు ఏళ్ళుగా డిప్యూటేషన్, మూడున్నర నెలలుగా ఇంచార్జ్ పాలన కొనసాగింది. మళ్ళీ ఇంచార్జ్ అధికారి కోసమే వేట మొదలయ్యింది. మండల పరిషత్ లోని ఇద్దరి అధికారుల పేర్లను సూచిస్తూ కలెక్టర్ కు పంపించారు. జిల్లా పాలనాధికారి తుది నిర్ణయం మేరకు సోమవారం (20వ తేది) మరో ఇంచార్జ్ ఎంపీడిఓ బాద్యతలు తీసుకోనున్నారు.

More articles

Latest article