బతుకమ్మ,మెండోరా: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదలను 2500 క్యూసెక్కుల నుంచి 4000 క్యూసెక్కుల కు నీటి విడుదలను పెంచారు. వరద కాలువ ద్వారా 5000 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 700 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వారా 250 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు, 80.5 టిఎంసిలు కాగా శనివారం 1084.80 అడుగులు, 59.237 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
