28.8 C
Hyderabad
Monday, August 3, 2026

దశాబ్దాల కల ఎంపీ అరవింద్ కృషివల్లే సాధ్యమైంది

Must read

📰 Generate e-Paper Clip

  • బిజెపి జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ కుమార్

 

ఇందల్వాయి, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా ప్రజల దశాబ్దాల కల ఎంపీ ధర్మపురి కృషి వల్లనే పసుపు బోర్డు సాధ్యమైందని బిజెపి జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ కుమార్ అన్నారు. ఇందల్వాయి మండల కేంద్రంలోని నిజామాబాదు జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ కుమార్, ఇందల్వాయి భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ, ఆధ్వర్యంలో శనివారం అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత  తీసుకురావడం జరిగిందన్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ కృషి మరువలేనిదని ఆనంద వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.గత ప్రభుత్వాలు ఎంతోమంది ఎంపీలు సాధించలేనిది నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ కృషి వల్లనే నిజాంబాద్కు పసుపు బోర్డు రావడం రైతులకు ఆనందకరమని పేర్కొన్నారు.ఇప్పటికైనా ప్రజలు రైతులు భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను ఆస్వాదించి పార్టీ పట్ల కృషి చేయాలని వారు అన్నారు.కొన్ని ప్రభుత్వాలు మోస పేరుత హామీలు ఇచ్చి పంగనామం పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని నిజామాబాద్ పార్టీ అధ్యక్షులు కులాచారి దినేష్ కుమార్ అన్నారు.నిత్యం ప్రజల పక్షాన ఆలోచించే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని కొనియాడారు.రానున్న రోజులలో స్థానిక ఎన్నికలలో బిజెపి పార్టీ తమ సత్తా చాటాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కెపి రెడ్డి, నాయుడు రాజన్న, శ్రావణ్ మెండే అశోక్, లోకని గోపి,మోహన్ రెడ్డి, శ్రావణ్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article