- కార్మిక సంఘం నాయకులు
బోధన్, బతుకమ్మ : శనివారం ఒక దినపత్రికలో ప్రచురితమైన నిజాం షుగర్ ఫ్యాక్టరీ తరలింపును తీవ్రంగా ఖండిస్తున్నామని కార్మిక సంఘం నాయకులు ఉపేంధర్, రవిశంకర్ గౌడ్ అన్నారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ ప్రధాన గేటు ముందు శనివారం ధర్నానిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఉన్న ఫ్యాక్టరీకి ఒక వంద కోట్లు పెడితే నడుస్తుందన్న స్థానిక ఎంఎల్ఏ సుదర్శన్ రెడ్డి తరలింపుకు రంగం సిద్ధం చేస్తున్నారని చాలా సందర్భాల్లో సూచనప్రాయంగా వెల్లడించారని అన్నారు. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ కోట్లకు విలువైన భూములు పైన కన్ను వేశారని అనుమానంగా ఉంది అని అన్నారు. ఎంఎల్ఏ సుదర్శన్ రెడ్డి తరలింపును ఆపకపోతే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇకనైనా కార్మికులకు రావలసిన వేతన బకాయి చెల్లించాలని ,ఫ్యాక్టరీ తరలింపు మానుకోవాలని కోరారు. గతంలో మీరు నియమించిన నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ సాధ్యాసాధ్యాలు కమిటీ ,కాలయాపన కమిటీగా మారిపోయిందని, అదేవిధంగా ఈ నెలలో మీరు రైతులతో సమావేశం ఏర్పాటు చేశారని అన్నారు. స్థానిక ఎంఎల్ఏ సుదర్శన్ రెడ్డి నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ తరలింపు మానుకోవాలని, ఇక్కడే నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ కి పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఆడ్లూరి శ్రీనివాస్, కార్మిక సంఘం నాయకులు బాలకృష్ణ ,శ్రీనివాస్,రాంబాబు, దేవిధాస్ ,తదితరులు పాల్గొన్నారు.
