27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మాట నిలుపుకున్న ఎంపీ అరవింద్

Must read

📰 Generate e-Paper Clip

  • నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ డాక్టర్. మల్లికార్జున్ రెడ్డి

 

భీమ్ గల్,బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని మాట ఇచ్చి, జాతీయ పసుపు బోర్డును జిల్లాలో ఏర్పాటు చేయించి ఇచ్చిన మాటను నిలుపుకొన్న ఘనత ఎంపీ అరవింద్ కే దక్కుతుందని బాల్కొండ నియోజకవర్గం బీజేపీ ఇంచార్జి ఏలేటి మల్లికార్జున్ రెడ్డి అన్నారు. శుక్రవారం భీమ్ గల్ లో మోడీ, పీయుష్ గొయల్, ఎం. పీ అర్వింద్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించిన అనంతరం ఎల్జే ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు.పసుపు బోర్డు ఏర్పాటు కాగానే తామే తెచ్చామని జబ్బలు చరుచుకుంటున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు పసుపు బోర్డు గురించి మాట్లాడే అర్హతలేదన్నారు. 40 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయించాలని ఎంపీ అరవింద్ పై దాడులు చేయించిన బీఆర్ఎస్ బోర్డు ఏర్పాటు కాగానే బోర్డు ఏర్పాటు లో కవిత ప్రమేయం ఉందని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయడం లో కవిత ప్రమేయం ఏమి లేదన్నారు. ఎంపీ కృషి తో చేసిన పసుపు బోర్డు ఏర్పాటు తో రైతులు స్వచ్చందంగా ఎంపీ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారని, కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కూడ అభినందనలు తెలిపి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సూచించారు. పసుపు బోర్డు ఎంపీ అరవింద్ తెచ్చారని తాము గర్వంగా చెబుతున్నట్టు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ లు అమలు చేయడం లో పూర్తిగా విఫలం అయ్యిందని, వారి పాలనలో రైతులు, మహిళలు, నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాలు నిరాశ తో ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కి చిత్తశుద్ధి ఉంటే ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల కొరకు బీజేపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసిన ఎంపీ అరవింద్ ను అభినందిస్తూ కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు చిత్త శుద్ధి నిరూపించుకోవాలని సూచించారు. ఈ ప్రెస్ మీట్ లో బీజేపీ మండల పార్టీ ప్రెసిడెంట్ మునిగే మహిపాల్, టౌన్ ప్రెసిడెంట్ కనికరం మధు,నాయకులు చిన్న గంగాధర్ గౌడ్, పీరి గంగాధర్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.

MP Arvind kept his word

More articles

Latest article