28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

పసుపు బోర్డుకు బడ్జెట్ లో నిధులు కేటాయించండి

Must read

📰 Generate e-Paper Clip

. . . కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ 

నిజామాబాద్, బతుకమ్మ

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇటీవల పసుపు బోర్డు ఏర్పాటు చేసిన నేపథ్యంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ కేంద్ర మంత్రి నిర్మలసీతారామన్ ను మర్యాద  పూర్వకంగా కలిసారు. ఢిల్లీలోని కేంద్ర ఆర్థిక మంత్రి కార్యాలయంలో ఆమెను కలిసి నిజామాబాద్ కు పసుపు బోర్డు కేటాయించిన తర్వాత జరుగుతున్న పరిణామాల గురించి, రైతుల హర్షం పట్ల వివరించారు. వచ్చే నెలలో ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్ లో పసుపు బోర్డుకు నిధులను కేటాయించాలని కోరారు. ఇది వరకే ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బోర్డు ఏర్పాటయిందని, అధికారుల నియామకం జరిగిందని, వ్యవస్థ గత నిర్మాణం కోసం నిధులను కేటాయించాలని కోరారు.

More articles

Latest article