26.6 C
Hyderabad
Monday, August 3, 2026

డ్రంక్ అండ్ డ్రైవ్ లో 18మందికి జైలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అతిగా మద్యం సేవించి వాహనం నడిపిన 18మందికి జైలు శిక్ష విధించినట్లు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఎల్.వెంకట రాజా రెడ్డి తెలిపారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ పరిధిలలో పలు పోలీస్ స్టేషన్ల వారిగా బుధవారం పట్టుబడిన వారికి సంబంధింత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించామని తెలిపారు. అనంతరం వారిని గురువారం జిల్లా కోర్టులో హజరు పర్చగా స్పెషల్ జుడిషియల్ 2వ క్లాస్ మెజిస్ట్రేటు నూర్జహన్ బేగం జైలు శిక్షవిధించారు. నిజామాబాద్ లోని నాగారం గ్రామానికి చెందిన ఎం.డి.అసాద్ హైమద్ కు, మోపాల్ మండలంలోని సిర్పూర్ గ్రామానికి చెందిన బద్ది భూమయ్యకు, మాక్లూర్ మండలంలోని ఒడ్యాట్ పల్లి గ్రామానికి చెందిన నిమ్మల చిన్న ఒడ్డెన్నలకు, మోపాల్ మండలం కంజర్ గ్రామానికి చెందిన అదరంగి సాయిలుకు, మోపాల్ మండలంలోని కంజర్ గ్రామానికి చెందిన సీహెచ్.స్వామి గౌడ్ కు, నిజామాబాద్ నగరంలోని ఆదర్శ నగర్ కు చెందిన వి.దయాకర్ కు ఒకరోజు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. భైంసా మండలంలోని పిప్రి గ్రామానికి చెందిన చాచేవార్ ప్రదీప్ కు, నిజామాబాద్ రూరల్ పరిధిలోని మారుతి నగర్ కు చెందిన ప్రకాశ్ నారాయణకు, గౌతం నగర్ కు చెందిన ఎం.భూమయ్యకు, మోపాల్ మండలానికి చెందిన ఇందూర్ నాగరాజుకు, సిరికొండకు చెందిన బండి విజయ్ కు, ఎండ్ల రాఖేష్ కు, దుబ్బాక రాజ్ కుమార్ కు, పెద్ద వాల్గోట్ కు చెందిన అల్లెపు రమేష్ కు, సిరికొండకు చెందిన బందెల ధర్మపురికి, కొండూరు గ్రామానికి చెందిన నాయుడి సాయికి, సిరికొండ మండలంలోని పంది మడుగు గ్రామానికి చెందిన సుంకవక్క నర్సయ్యకు, చిన్నవాల్గొట్ గ్రామానికి చెందిన బదాల భాస్కర్ కు రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.

More articles

Latest article