25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

రేవంత్ వరెస్ట్ పాలనలో అరెస్టుల పర్వం

Must read

📰 Generate e-Paper Clip

  • హామీల అమలుపై ప్రశ్నిస్తే అక్రమ నిర్బందాలు
  • పోలీస్ స్టేషన్లా? కాంగ్రెస్ కార్యాలయాలా?
  • బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వార్నింగ్

నిజామాబాద్, బతుకమ్మ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరెస్టు పాలనలో ప్రశ్నించే వారిపై అరెస్టుల పర్వం కొనసాగుతుందని నిజామాబాద్ బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు. ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తే అక్రమ నిర్బంధాలు, అరెస్టులా అని మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలపై ఇటీవల ప్రశ్నించడం మొదలయిందన్నారు. నందిపేట్ లో పోస్టర్లు వేశారని బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం సబబు కాదన్నారు. పోలీస్ స్టేషన్లా? కాంగ్రెస్ కార్యాలయాలా? లేక కాంగ్రెస్, బీజేపీ ల భజన మందిరాలా అని ఆయన నిలదీశారు. అక్కడ మోడీది ఈడీ పాలన. ఇక్కడ రేవంత్ ది ఏసీబీ,జేసీబీ పాలన అని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ లు ప్రజాకంటకం, ప్రాణసంకటంగా మారాయి.బీఆర్ఎస్ పై కాంగ్రెస్, బీజేపీలువిషం కక్కుతున్నాయన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ నిర్భందాలు, అరెస్టులపై ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

More articles

Latest article