27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

లెక్చరర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా 

Must read

📰 Generate e-Paper Clip

డిస్ట్రిక్ట్ బీ. సీ లెక్చరర్స్ అసోసియేషన్ ఇంచార్జ్ డాక్టర్. మండలోజు నర్సింహాస్వామి 

భీమ్ గల్, బతుకమ్మ : జిల్లాలో పని చేస్తున్న లెక్చరర్ల సమస్యల సాధనకు తనవంతు కృషి చేస్తానని డిస్ట్రిక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ఇంచార్జ్ డాక్టర్. మండలోజు నర్సింహాస్వామి అన్నారు. డిస్ట్రిక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ఇంచార్జ్ గా బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికై నియామక పత్రాన్ని అందుకొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేద, బడుగు, బలాహీన వర్గాల విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే స్కాలర్ షిప్ లు, ఇతర ప్రోత్సాహకాల పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని అన్నారు. బీ. సీ అభ్యున్నతికి నిరంతరం పని చేస్తానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి తనకు జిల్లా భాద్యతలు అప్పగించిన స్టేట్ లెక్చరర్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్. కృష్ణయ్య, స్టేట్ ప్రెసిడెంట్ కాముని సుదర్శన్, స్టేట్ జనరల్ సెక్రటరీ విట్టల్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

More articles

Latest article