28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

జేసిఐ అధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

Must read

📰 Generate e-Paper Clip

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:

జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ ఇందూర్, జేసిఐ అలుమ్ని క్లబ్ ఆద్వర్యంలో మంగళవారం నిజామాబాదు నగరంలోని ఇంద్రాపూర్ లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలకు గాలిపటాలు పంపిణీ చేశారు. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జేసిఐ ఇందూర్ అధ్యక్షురాలు పెందోటి గౌతమి,కార్యదర్శి కె.జైపాల్,ప్రోగ్రామ్ చైర్మెన్ కోడూరు శ్రీనివాస్,జోన్ ఆఫీసర్ నయన్,జేఏసి ఉపాద్యక్షులు జిల్కర్ విజయానంద్, పూర్వాద్యక్షులు విజయానంద్, వీరబ్రహ్మం, పి.చంద్రశేఖర్, గంగాదాస్,లావణ్య, మనోజ్, సభ్యులు నాగేందర్,నాగరాజు,నిపున్,స్వరూప్ పాల్గొన్నారు

Sankranti celebrations under JCI

More articles

Latest article