26.6 C
Hyderabad
Monday, August 3, 2026

మాలమహనాడు నేతలను అరెస్టు చేసిన పోలిస్ లు

Must read

📰 Generate e-Paper Clip

. . . బస్టాండ్ వద్ధ నిరసన తెలుపుతుండగా అడ్డుకున్న పోలిస్ లు

 బతుకమ్మ, నిజామాబాద్ సిటి:

సుప్రిం కోర్టు ఎస్సీ వర్గీకరణ కు ఇచ్చిన తీర్పును నిరశిస్తు మాల మహనాడు బుదవారం భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. బుదవారం భారత్ బంద్ సందర్బంగా మాల మహానాడు నాయకులు నిజామాబాద్  బస్స్టాండ్ వద్ద దర్నా చేస్తుంటే అరెస్ట్ చేసి ఒకటవ టౌన్ పోలిస్ స్టేషన్ కు తరలించారు. సోంత పూచికత్తుపై వదిలివేయగా ఆనంతంరం మాలమహనాడు నేతలు ఫూలాంగ్ అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన తెలిపారు. ఈ సంధర్బంగా మాలమహనాడు నేతలు మాట్లాడుతు…. శాంతియుతంగా బందు చేస్తే అరెస్ట్ చేసి  భారత్ బంద్ ను భంగం చేశారని అన్నారు. వర్గికరణ వద్దు కలిసుంటే ముద్దు 341 ఆర్టికల్ ప్రకారం 2024 జనాబా సెన్సెక్స్ నిర్వహించి  రిజర్వేషన్ లను పెంచాలని కోరారు. అలాగే ప్రవేట్ కంపెనీ లాలో, కాంట్రాక్ట్ పనులలో, ఉద్యోగ రోస్టర్ పద్దతి పాటించాలి అని కోరారు. అంబేద్కర్ వ్రాసిన రాజ్యంగాని కాపాడుదాం, రాజ్యంగాని రద్ధు చేస్తామని అంటే రాబోయే ఎన్నికలలో బుద్ది చెబుతాం అన్నీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మలమహనాడు జిల్లా ప్రదాన కార్యదర్శి నాయుడు రాజు మాల మహానాడు సినీయార్ నాయకులు నంది వినయ్‌కుమార్, నీలగిరి రాజు, పోచమ్మ గల్లీ మాల సంఘం అద్యక్షులు పులి జైపాల్, నీలగిరి చందు, యడ్ల అశోక్, మాల సంగం నాయకులకు బంగారు సాయిలు, సక్కి విజయ్ తదితరులు ఉన్నారు.

More articles

Latest article