ఏఐకేఎంఎస్ జిల్లాఅధ్యక్షులు వేల్పుర్ భూమయ్య
నిజామాబాద్, బతుకమ్మ : రైతు నాయకులు జగ్జీత్ సింగ్ దల్లేవాలా ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని ఏఐకేఎంఎస్ జిల్లాఅధ్యక్షులు వేల్పుర్ భూమయ్య అన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలో సోమవారం ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు ఉద్యమానికి మోడీ ప్రభుత్వం ఇచ్చిన లిఖితపూర్వక హామీలను అమలు చేయాలని పంజాబ్లో రైతు నాయకులు జగదీత్ సింగ్ దల్లే వాలా గత 46 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారని తెలిపారు. వీరి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుంది వీరి ప్రాణాలు ఇప్పుడా అప్పుడా అన్నట్లు ఉన్న కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. వీరి ప్రాణాలకు ఎలాంటి ముప్పు ఏర్పడిన అది కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. కేంద్రం లోని ఆర్ఎస్ఎస్ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం భారత వ్యవసాయ రంగాన్ని బలిపీఠంపై నిలబెడుతుందని అన్నారు. దేశ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పుతుందని, పచ్చటి పంట పొలాలను దానిమీద ఆధారపడ్డ రైతులను వారి భూముల నుండి బేధాకలు చేసి ఆట్టి భూములను అదాని, అంబానీలకు మోడీ ప్రభుత్వం అప్పచెప్పుతుందని అన్నారు. వ్యవసాయ రంగంలో తెచ్చిన నల్ల చట్టాల రద్దుకై 13 నెలల పాటు జరిగిన రైతు ఉద్యమంలో 750 మంది రైతుల ప్రాణాలు బలిగొన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రైతు నాయకులు దల్లేవాలా ప్రాణాలతో కూడా చలగటం ఆడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతు ఉద్యమ నాయకులతో చర్చలు జరపాలని, ఎంఎస్పీ మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలని, భారత రైతును రుణ విముక్తులను చేయాలని, విద్యుత్ సవరాన బిల్లును, ఉపసంహరించుకోవాలని రైతాంగ సమస్యలన్నీ పరిష్కరించి దల్లే వాళ్లతో చర్చలు జరిపి వారి దీక్షను విరామింప చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు టి.కృష్ణ గౌడ్, సహాయ కార్యదర్శి బి.దేవస్వామి,డి. పద్మ, బన్సీ తదితరులు పాల్గొన్నారు.
