రైతు నాయకులు జగ్జీత్ సింగ్ దల్లేవాలా ప్రాణాలకు ముప్పు
ఏఐకేఎంఎస్ జిల్లాఅధ్యక్షులు వేల్పుర్ భూమయ్య నిజామాబాద్, బతుకమ్మ : రైతు నాయకులు జగ్జీత్ సింగ్ దల్లేవాలా ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని ఏఐకేఎంఎస్ జిల్లాఅధ్యక్షులు వేల్పుర్ భూమయ్య అన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలో సోమవారం ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు ఉద్యమానికి మోడీ ప్రభుత్వం ఇచ్చిన లిఖితపూర్వక హామీలను అమలు చేయాలని పంజాబ్లో రైతు నాయకులు జగదీత్ సింగ్ దల్లే వాలా గత 46 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారని...