24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆలూర్ మండలం కేంద్రం లో స్వామి వివేకానంద 163 వ జయంతివేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ

ఆలూరు మండల కేంద్రంలో మా ఊరు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 163 వ జయంతి వేడుకలును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు రామచందర్ , డాక్టర్ అరుణ్ మాట్లాడుతూ స్వామి వివేకానందుని ఆలోచనలు, సందేశాలు, యువతకు స్ఫూర్తి,యువతరమే దేశ భవిష్యత్ అని మరియు ఆయన చెప్పిన మాటలు మనందరినీ చైతన్యవంతం చేస్తాయి అని అన్నారు.ఈ జయంతి సందర్భంగా, మన శక్తి, జ్ఞానం సమాజం అభ్యున్నతికి ఉపయోగపడేలా కృషి చేద్దాం అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో సంస్థ అధ్యక్షులు గాండ్ల రామచందర్, ఉపాధ్యక్షులు మెడికల్ స్వామి, కార్యదర్శి డాక్టర్ అరుణ్,సెక్రెటరీ గాండ్ల రమేష్ విడిసి అధ్యక్షులు బార్ల ముత్యం,ఆలూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ముక్కెర విజయ్, అబ్బ బాబురావు, టీచర్ శ్రీనివాస్,ఎంపీటీసీ మల్లేష్, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article