బతుకమ్మ భిక్కనూరు: పొలానికి నీరు పార పెట్టడానికి వెళ్లి కరెంట్ షాక్ కు గురై రైతు మృతి చెందిన విషాద సంఘటన భిక్కనూరు మండలంలోని తిప్పాపూర్ లో బుధవారం ఉదయం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బైని మల్లారెడ్డి(61) ఉదయం పొలానికి నీరు పార పెట్టడానికి వెళ్లి స్టార్టర్ వద్ద కరెంట్ షాక్ కు గురై అక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందజేశారు.
