27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

నారాయణ కళాశాల గుర్తింపును రద్దు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ: రెసిడెన్షియల్ బిల్డింగ్ లో కళాశాల నడిపిస్తూ విద్యార్థల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్న నారాయణ జూనియర్ కళాశాల గుర్తింపును రద్దు చేయాలని విద్యార్థి ఐక్య సంఘాల నాయకులు డిమాండ్  చేశారు. ఈ మేరకు మంగళవారం విద్యార్థి నాయకులు డీఐఈవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐపీఎస్ యూ రాష్ర్ట అధ్యక్షుడు బోడ అనిల్ మాట్లాడుతూ.. అడ్మిషన్ లకు సంబంధించి నోటిఫికేషన్ రాకముందే నారాయణ జూనియర్ కళాశాల డిస్కౌంట్ లను ప్రకటించి అడ్మిషన్ లను ప్రారంభించిందన్నారు. తప్పుడు ర్యాంకులతో పాంప్లేట్ ప్రింట్ చేసి ఎక్కడో వచ్చిన ర్యాంకులను నిజామాబాద్ క్యాంపస్ లోనే వచ్చినట్లు చూపుతూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుభాష్ నగర్ లో నిర్మాణంలో ఉన్న పిల్లర్లనే బిల్డింగ్ పూర్తయింది అంటూ అడ్మిషన్లు చేస్తున్నారని, అధికారులను సైతం బురిడీ కొట్టిస్తున్న నారాయణ కళాశాల యొక్క గుర్తింపును రద్దుచేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు.  వినతిపత్రం అందజేసిన వారిలో ఏఐఎఫ్ డీఎస్ జాతీయ కన్వీనర్ మేత్రి రాజశేఖర్, టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్, టీవీయూవీ రాష్ట్ర అధ్యక్షుడు లాల్ సింగ్, జీవీఎస్ జిల్లా అధ్యక్షులు జైత్రం రాథోడ్, ఏఐఎస్బీ రాష్ట్ర నాయకులు రాహుల్ , రవీందర్ గౌడ్, ఏఐపీఎస్ యూ నాయకుడు గోపాల్ సింగ్ ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article