నారాయణ కళాశాల గుర్తింపును రద్దు చేయాలి

నిజామాబాద్, బతుకమ్మ: రెసిడెన్షియల్ బిల్డింగ్ లో కళాశాల నడిపిస్తూ విద్యార్థల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్న నారాయణ జూనియర్ కళాశాల గుర్తింపును రద్దు చేయాలని విద్యార్థి ఐక్య సంఘాల నాయకులు డిమాండ్  చేశారు. ఈ మేరకు మంగళవారం విద్యార్థి నాయకులు డీఐఈవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐపీఎస్ యూ రాష్ర్ట అధ్యక్షుడు బోడ అనిల్ మాట్లాడుతూ.. అడ్మిషన్ లకు సంబంధించి నోటిఫికేషన్ రాకముందే నారాయణ జూనియర్ కళాశాల డిస్కౌంట్ లను ప్రకటించి అడ్మిషన్ లను ప్రారంభించిందన్నారు. తప్పుడు ర్యాంకులతో పాంప్లేట్...