- రాష్ట్రస్థాయి హాకీలో మెరిసిన మాచారెడ్డి జూనియర్ కళాశాల విద్యార్థిని
బతుకమ్మ, మాచారెడ్డి: మాచారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని తగిరంచ శ్రావ్య తన సత్తా చాటి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. నల్గొండ జిల్లా లో జరిగిన 68వ ఎస్ జి ఎఫ్ ఐ బాలికల రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంట్ లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జట్టు మూడవ స్థానంలో నిలిచింది. జట్టులోఉత్తమ ప్రతిభ చాటిన
తగిరంచ శ్రావ్య మాచారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతుంది. చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తున్న శ్రావ్య జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపిక కావడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్ యాఖినొద్దీన్, స్పోర్ట్స్ ఇంచార్జ్ నర్సింలు, అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి హాకీ లో ప్రాతినిధ్యం వహిస్తా నని తగిరంచ శ్రావ్య ఆశభావం వ్యక్తం చేసింది. ఇదే నెలలో 28నుండి ఫిబ్రవరి 2 వరకు ఝార్ఖండ్ రాష్ట్రం లో జరుగబోయే జాతీయ స్థాయి పోటీలలో ప్రాతినిధ్యం వహించే నున్నట్లు వెల్లడించారు.
