బతుకమ్మ,బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలో పురాతనమైనటువంటి అల్లకొండ ఖిల్లా మరమ్మత్తుల కోసం ఆర్డిఓ ద్వారా కలెక్టర్ కు నివేదిక పంపాలని మంగళవారం ఆంధ్రప్రదేశ్,తెలంగాణ నేషనల్ యూత్ ప్రాజెక్ట్ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ యూత్ ఆర్గనైజేషన్, దక్షిణ ఆసియా మైత్రి సదస్సు అధ్యక్షులు మోతే రమా గౌడ్, అల్ల కొండ ఖిల్లా పరిరక్షణ సమితి కార్య నిర్వాహక అద్యక్షులు బి.ఆర్.నర్సింగ్ రావు, ఆర్మూర్ ఆర్డీవో బి.రాజగౌడ్ కి విజ్ఞప్తి చేశారు. పూర్వం 1059 లో అల్లయ్య, కొండయ్య ల మల్ల యోధులచే నిర్మితమైన ఆల్లకొoడ పట్టణం దేశంలోనే “రెండో రాజధానిగా ” పేరు ప్రఖ్యాతలు ఉన్నాయన్న ఇదే విషయాన్ని 1780- 1836 కాలంలో మద్రాసు సుప్రీంకోర్టు ప్లీడరు అయినటు వంటి ఏనుగుల వీరస్వామి “కాశీయాత్ర ” లో పర్యటన చేస్తూ హైదరాబాద్ పట్టణం నుండి బిక్కవోలు,రతాల రామారెడ్డి, నుండి డిచ్చిపల్లి, ఆరమూరు నుండి అల్లకొండ వరకు పాద యాత్ర గా 1830 లో జూన్ 26 నుండి 29 వరకు ఆల్లకొoడ లోనే ఉన్నారన్న విషయం ఏనుగుల వీరస్వామి ఆయన వ్రాసిన డైరీ లో అల్ల కొండ ప్రాంతo లో వ్యవసాయ పద్ధతులు,ఈ ప్రాంత సంపద గురించి వివరించారని, ఇదే విషయాన్ని ” అల్లకొoడ ఊరు ఉద్భవo – ఐదు ఆలయాలకు ప్రసిద్ధి అనే పుస్తకంలో పుస్తక సంకలన రచయిత బ్రహ్మ రౌతు నర్సింగ్ రావు వివరించారని వారు అన్నారు.ఇది బాల్కొండ ఖిల్లా మరమ్మత్తుల విషయమై ఆగస్టు 2024 లో దేశ ప్రధానమంత్రి కి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేయగా రాష్ట్ర పురాణా శాఖ ద్వారా ఉన్నత అధికారులు బాల్కొండ ఖిల్లా ని సందర్శించారని మోతే రామా గౌడ్ , అల్లు కొండ ఖిల్లా పరిరక్షణ సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు బి.ఆర్ నర్సింగరావు ఆర్డిఓకి విజ్ఞప్తి చేస్తూ, బాల్కొండ ఖిల్లా మరమ్మత్తుల గురించి జిల్లా కలెక్టర్ ద్వారా నివేదిక తయారుచేసి, రాష్ట్ర పురస్ శాఖకు నివేదికను పంపాలని మోతెరామా గౌడ్, నర్సింగ్ రావు ఆర్మూర్ ఆర్.డిఓ.కు సమర్పించిన వినతిపత్రంలో కోరారు.
