- సీఎం దిష్టిబొమ్మ ను దహనం చేసిన బీఆర్ఎస్
బతుకమ్మ, మాచారెడ్డి: రైతు భరోసా కింద ఏడాది కి ఎకరాకు 15000 రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన ఏడాది తర్వాత 12000 ప్రకటించి రైతులను దగా చేసిందని నిరసిస్తూ మాచారెడ్డి ఉమ్మడి మండల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ ను దగ్ధం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు రైతుల తరపున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో
మాచారెడ్డి మండల బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు పగడాల బాలచంద్రం, ప్రధానకార్యదర్శి రాజాగౌడ్, మాజీ అధ్యక్షులు హంజినాయక్, రైతుబంధు జిల్లా మాజీ సభ్యులు గోవిందరెడ్డి, వీర హనుమాన్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ మాజీ చైర్మన్ పొన్నాల శ్రీకాంత్ రెడ్డి, మండల మాజీ కో- ఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖాన్, మాజీ ఎంపీటీసీ లు బూస శ్రీనివాస్, బట్ట రమేష్, గంగారెడ్డి, మాజీ సర్పంచ్, ఉపసర్పంచ్ లు శ్రీ శైలం, మల్లేష్ యాదవ్, మోతుకు ఎల్లయ్య, అంబటి నారాయణ, బెల్లం చంద్రం, అజీజ్, నర్సింలు, పోచయ్య, వివిధ గ్రామాల అధ్యక్షులు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
