30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

“సంక్రాంతికి వస్తున్నాం” ఏర్పాట్లు పరిశీలించిన బృందం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా ట్రైలర్ లాంచ్ ఏర్పాట్లను ఆదివారం ఎస్వీసీ మేనేజర్ నాగేశ్వర్ రావు, నరాల సుధాకర్, సంతోష్, కొయ్యాడ శంకర్ బృందం  పరిశీలించారు. దిల్ రాజు ప్రెజెంట్స్, విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ జనవరి 6న నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్ లో గ్రాండ్ గా లాంచ్  చేయనున్నారు. విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి, ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సక్సెస్ ఫుల్ కొలాబరేషన్ లో హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఇప్పటికే సాంగ్ సెన్సేషనల్ హిట్ గా నిలిచాయి. ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్ జనవరి6న నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్ లో గ్రాండ్ గా లాంచ్  చేయనున్నారు. భారీగా జరిగే ఈ ఈవెంట్ కి ‘సంక్రాంతికి వస్తున్నాం’ టీం అంతా హాజరుకానుంది.  ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, సినిమాటోగ్రఫీని సమీర్ రెడ్డి నిర్వహిస్తుండగా, ఎ.ఎస్.ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్. తమ్మిరాజు ఎడిటర్, స్క్రీన్ ప్లే: ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ. యాక్షన్ సన్నివేశాలకు రియల్ సతీష్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా విడుదల కానుంది. తారాగణం: వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, ఉపేంద్ర లిమాయే, సాయి కుమార్, నరేష్, విటి. గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్ మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి సాంకేతిక సిబ్బంది: రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి, సమర్పణ: దిల్ రాజు, బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, నిర్మాత: శిరీష్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, డీవోపీ: సమీర్ రెడ్డి, ప్రొడక్షన్ డిజైనర్: ఎఎస్. ప్రకాష్, ఎడిటర్: తమ్మిరాజు, కో రైటర్స్: ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ, యాక్షన్ డైరెక్టర్: రియల్ సతీష్, వీఎఫ్ఎక్స్: నరేంద్ర లోగిసా, పీఆర్వో: వంశీ-శేఖర్, డిజిటల్: హాష్‌ట్యాగ్ మీడియా.

More articles

Latest article