ప్రైవేట్ హాస్సిటల్ బాధితుల సమితి ఆధ్వర్యంలో దిష్టి బొమ్మ దహనం

0 1,429

నిజామాబాద్, బతుకమ్మ : ఇందూర్ నగరంలోని స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో కొన్ని ప్రైవేటు హాస్పిటల్స్, మెడికల్ ల్యాబ్, స్కానింగ్ సెంటర్ల మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ శనివారం ప్రైవేట్ హాస్పిటల్ బాధితుల సమితి ఆధ్వర్యంలో హాస్పిటల్స్ మాఫియా దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో కొన్ని ప్రైవేట్ హాస్పిటలలో మెడికల్ ల్యాబ్, స్కానింగ్ మాఫియా నడుస్తుందని కొంతమంది పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. పల్లెల నుండి నగరానికి వైద్యం కోసం వస్తే కొంతమంది మాఫియా ధనార్జనే ధ్యేయంగా అవసరం లేని టెస్టులు రాస్తు డబ్బులు దండుకుంటున్నారని అన్నారు. గతంలో ఒక స్కానింగ్ సెంటర్లో మహిళలకు సంబంధించిన అసభ్య చిత్రాలు చిత్రీకరించారని తెలిస్తే ప్రభుత్వ యంత్రాంగం అధికారులు ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా ఈ మధ్యకాలంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్ కన్సల్టేషన్ లేకుండానే రిసెప్షనిస్టు ఎంఆర్ఐ రాసిన పరిస్థితిని చూసామని, ఒక ప్రైవేట్ న్యూరో హాస్పిటల్లో మూడు రోజులకు సరిపడా టాబ్లెట్స్ డాక్టర్ రాసిస్తే మేము మూడు రోజులకు సరిపడా టాబ్లెట్స్ ఇవ్వం, మొత్తం టాబ్లెట్ షీట్ ఇస్తామని  పేషెంట్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ మెడికల్, ల్యాబ్ స్కానింగ్ మాఫియా పై సంబంధిత ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లి శ్రీకాంత్, హన్మాండ్లు(బుజ్జి), రాజు గణేష్, అజిగిరి రాకేష్, నల్ల నవీన్, సాయికుమార్, చంటి, సతీష్, నవీన్, మధు, ప్రశాంత్, సుజిత్, కళ్యాణ్, కృష్ణ, ప్రసాద్, అక్షయ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.