ప్రైవేట్ హాస్సిటల్ బాధితుల సమితి ఆధ్వర్యంలో దిష్టి బొమ్మ దహనం

నిజామాబాద్, బతుకమ్మ : ఇందూర్ నగరంలోని స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో కొన్ని ప్రైవేటు హాస్పిటల్స్, మెడికల్ ల్యాబ్, స్కానింగ్ సెంటర్ల మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ శనివారం ప్రైవేట్ హాస్పిటల్ బాధితుల సమితి ఆధ్వర్యంలో హాస్పిటల్స్ మాఫియా దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో కొన్ని ప్రైవేట్ హాస్పిటలలో మెడికల్ ల్యాబ్, స్కానింగ్ మాఫియా నడుస్తుందని కొంతమంది పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. పల్లెల నుండి నగరానికి వైద్యం...