- సబ్ కలెక్టర్ చెప్పిన తీరు మారలే
బతుకమ్మ: బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని స్థానిక గ్రంథాలయం ముందు కొందరు వ్యక్తులు ఇస్టరీతిన కార్లు పార్కింగ్ చేయడంతో గ్రంథాలయనికు వచ్చిన పాఠకుల వాహనాలు ఎక్కడ నిలపాలో అర్థం కాని పరిస్థితిల మధ్య పాఠకులువేరువేరు చోట్లలో తమ వాహనాలను ఆపుతూ ఇబ్బందులకు గురవుతున్నామని పాఠకులు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో వెంటనే గ్రంధాలయం ముందు నుంచి అట్టి కార్లను తీసివేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికిని అక్కడి నుంచి కార్లు కదలకపోవడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడి కారు సైతం అక్కడ ఉండడంతోనే కార్లు కదలడం లేదు అంటూ పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అట్టికార్లను గ్రంథాలయం ముందు నుంచి తొలగించాలని పాఠకులు విజ్ఞప్తి చేస్తున్నారు.
