26.2 C
Hyderabad
Monday, August 3, 2026

జర్నలిస్టులను బెదిరించిన వ్యక్తిపై కేసు నమోదు

Must read

📰 Generate e-Paper Clip

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:  నిజామాబాద్ నగరంలో మైనార్టీ ఏరియాలో జరిగిన అవినీతి, అక్రమాల గురించి వార్తలు రాసిన జర్నలిస్టులను ఇంట్లోకి వచ్చి దాడి చేస్తామని, చంపుతామని బెదిరించిన వ్యక్తిపై రెండో టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ యాసర్ ఆరాఫత్ తెలిపారు. నగరంలోని రెండవ టౌన్ ప్రాంతానికి చెందిన అశ్వక్ అహ్మద్ ఖాన్ గత నెలలో  మార్నింగ్ టైమ్స్ దిన పత్రికలో కొన్ని అవినీతి అక్రమాల గురించి వార్తలు రాశారు. ఈ విషయంలో హఫీజ్ మహ్మద్ లాయిక్ ఖాన్ అనే వ్యక్తి ఖిల్లారోడ్డులోని ఒక ప్రైవేట్ ఫక్షన్ హల్లో జరిగిన మీటింగ్ లో అశ్వక్ అహ్మద్ ఖాన్ ఇంట్లోకి వెళ్లి దాడి చేస్తామని హెచ్చరించాడు. అంతే గాకుండా గతంలో  షకీర్ హుస్సేన్ అనే యువకుడికి పట్టిన గతే పడుతుందని బెదిరించిన విషయంపై ఫిర్యాదు చేయడంతో  హఫీజ్ మహ్మద్ లాయక్ ఖాన్ పై బిఎన్ఎస్ యాక్ట్ క్రింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

More articles

Latest article