బతుకమ్మ, ఏర్గట్ల: ఆదర్శ మహిళ సావిత్రిబాయి పూలే జయంతినీ పురస్కరించుకొని ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల విద్యాశాఖాధికారి ఆనంద్ రావు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జీవితం అందరికీ ఆదర్శవంతమని అన్నారు. ఎంతోమంది మహిళలకు విద్యా దానం చేసిన గొప్ప వనిత అని పేర్కొన్నారు. అలాగే ప్రధానోపాధ్యాయులు కృష్ణాచారి మాట్లాడుతూ, నేటి పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాలలో ముందున్నారని దీనికి ప్రధాన కారణం చదివే అని తెలిపారు. అలాంటి చదువును అందరికీ అందే విధంగా చేసిన సావిత్రిబాయి పూలే చాలా గొప్ప ఆదర్శ మహిళయని పేర్కొన్నారు. వారి జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం గొప్ప విషయం అని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న సమత, సబిత, ఇందిర,కు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, స్కూల్ పిల్లలు, పాల్గొన్నారు.
