24.7 C
Hyderabad
Monday, August 3, 2026

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ :  ఆర్మూర్ పట్టణంలో బిఆర్ఎస్ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్ మాట్లాడుతూ మహిళలు విద్యా రంగం ముందు ఉంచాలని తపనతో సావిత్రిబాయి పూలే ఎంతో కృషి చేశారని వారి ఆశయ సాధన దిశగా విద్యార్థులు మహిళలు  విద్యా రంగంలో మహిళలు ముందు ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పోల సుధాకర్, మాజీ సర్వ సమాజ్ అధ్యక్షులు సుంకరి రవి, దొండి శ్యామ్, మీరా శ్రావణ్ యువజన కమిటీ మండల అధ్యక్షులు ఆగ్గు క్రాంతి,  సైఫ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article