29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

మనస్థాపానికి గురై ఒకరి ఆత్మహత్య 

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : తాను ఉన్న ఊరిలో ఉండడానికి ఇల్లు లేదని, వయస్సు గడుస్తున్న తనకు వివాహం జరగడం లేదని మనస్థాపానికి గురైన వ్యక్తి ఆత్మహత్య చేసుకొన్న ఘటన గురువారం మండలంలోని గోనుగొప్పుల గ్రామంలో చోటుచేసుకొంది. ఎస్సై మహేష్ తెలిపిన వివరాల మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గోనుగొప్పుల గ్రామానికి చెందిన బొప్పేన శ్రీధర్ (29) అనే వ్యక్తికి సొంత ఇల్లు లేదని, ఇంకా తనకు పెండ్లి కావడం లేదని మానస్థపానికి గురియై, విరక్తి తో ఇంట్లో దులానికి ఉరి వేసికొని ఆత్మహత్య చేసుకొన్నాడు. శవ పంచానామా నిర్వహించి, మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిర్వహింపజేసీ,మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article