24 C
Hyderabad
Sunday, August 2, 2026

జనాభా నిష్పత్తి ప్రకారం వర్గీకరించాలి

Must read

📰 Generate e-Paper Clip

మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు బరికుంట శ్రీనివాస్ మాదిగ

 

నిజామాబాద్, బతుకమ్మ: ఎస్సీ రిజర్వేషన్లను 59షెడ్యూల్ కులాలను వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం వర్గీకరించాలని మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు బరికుంట శ్రీనివాస్ కోరారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ డా.షమీం అక్తర్ కు గురువారం మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 1994 నుంచి మాదిగలు షెడ్యూల్ కులాలకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను, రాజ్యాంగ ఫలాలను ఎస్సీలలో ఉన్న అన్ని కులాలకు అందించేందుకు పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఎస్సీలందరినీ ఒకే వర్గంగా భావించడం వల్ల వారికి కేటాయించిన 15శాతం రిజర్వేషన్లలో మాదిగ కులాలలో పాటు మిగతా 57 కులాలకు తమ న్యాయమైన వాటా దక్కకపోవడంతో గత 30ఏళ్లుగా మాదిగలు పోరాటం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద కులం మాదిగ కులమని, మొత్తం షెడ్యూల్ కులాల జనాభాలో 70శాతం ఉన్నప్పటికీ మాదిగలు విద్య, ఉద్యోగ రంగాలలో అత్యంత వెనుకబడ్డారని అన్నారు. 59షెడ్యూల్ కులాల మధ్య కూడా స్పష్టమైన అసమానతలు విద్య, ఉద్యోగ రంగాలలో నెలకొన్నాయని అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ ఫలాలను 59 షెడ్యూల్ కులాలలో ఒక్క మాల కులం మాత్రమే అగ్రశ్రేణి ఉద్యోగాలలోను, డాక్టర్లు, ఇంజనీర్లు వంటి అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో వినియోగించుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article