జనాభా నిష్పత్తి ప్రకారం వర్గీకరించాలి
మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు బరికుంట శ్రీనివాస్ మాదిగ నిజామాబాద్, బతుకమ్మ: ఎస్సీ రిజర్వేషన్లను 59షెడ్యూల్ కులాలను వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం వర్గీకరించాలని మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు బరికుంట శ్రీనివాస్ కోరారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ డా.షమీం అక్తర్ కు గురువారం మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 1994 నుంచి మాదిగలు షెడ్యూల్ కులాలకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను,...