30.9 C
Hyderabad
Monday, August 3, 2026

ఖథ్గాంలో కాదేపురం గంగన్నకు ఘన సన్మానం 

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ:బిచ్కుంద :  కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం ఖథ్గాం గ్రామంలో బుధవారం తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన కాదేపురం గంగన్నకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా గ్రామంలోని దళిత నాయకులు అయనకు శాలువా, పూలమాలతో సత్కరించి, అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ తాను తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టుల కోసమే కాకుండా ఎస్సీ, ఎస్టీ సామజిక వర్గాల సమస్యల పరిష్కారం కోసం కూడా కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో గ్రామ మాజీ ఉప సర్పంచ్ మాశెట్టి సాయిలు, దళిత నాయకులు పసుపుల పిరాజీ, మాశెట్టి శంకర్, పసుపుల రాములు, పసుపుల నాగేశ్వరావు, మాశెట్టి పండరి, ఆంజనేయులు, పసుపుల విఠల్, లాలయ్య, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article