ఖథ్గాంలో కాదేపురం గంగన్నకు ఘన సన్మానం
బతుకమ్మ:బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం ఖథ్గాం గ్రామంలో బుధవారం తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన కాదేపురం గంగన్నకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా గ్రామంలోని దళిత నాయకులు అయనకు శాలువా, పూలమాలతో సత్కరించి, అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ తాను తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టుల కోసమే కాకుండా ఎస్సీ, ఎస్టీ సామజిక వర్గాల సమస్యల పరిష్కారం కోసం కూడా కృషి చేస్తానని అన్నారు....