బతుకమ్మ,మోర్తాడ్: యావత్ భారతదేశ చరిత్రలో 01 జనవరి 1818 భీమా కోరేగావ్ యుద్ధం ఈ దేశ మూలవాసులకు ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని అందించిన శుభ సందర్భం అని దళిత సంఘాల నాయకులు అన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో అమరవీరుల స్థూపం వద్ద బుధవారం ముందుగా భీమా కోరేగావ్ యుద్ధంలో విరోచిత పోరాడి చారిత్రాత్మకమైన విజయాన్ని అందించిన వీర యోధులను స్మరించుకుని డా,అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు అంగులి మాల, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు ఉమేష్ మహారాజ్, దళిత సంక్షేమ సంఘం అధ్యక్షులు మళ్లూరి రాజారామ్, నాయకులు జాంబవ చమర్, మామిడి గంగాధర్, కూన ప్రవీణ్, బత్తుల గంగారం తదితరులు పాల్గొన్నారు.
