26.2 C
Hyderabad
Monday, August 3, 2026

బీసీ మహాసభను విజయవంతం చేయండి

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ లో జరగబోయే బీసీ మహాసభను విజయవంతం చేయాలని శాతవాహన యూనివర్సిటీ నాయకులు నైతం మహేష్ కోరారు.  ఈ నెల 3న ఇందిరా పార్క్ దగ్గర సావిత్రి పూలే జన్మదిన సందర్భంగా నిర్వహించే బీసీ మహాసభల పోస్టర్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శాతవాహన యూనివర్సిటీ నాయకులు నైతం మహేష్ మాట్లాడుతూ బీసీ లో ఉన్న అన్ని కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. సావిత్రిబాయి పూలే ఆశయాలను కాపాడే వారసుల్లాగా ఈ మహాసభను విజయవంతం చేయాలని సూచించారు. కామారెడ్డిలో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తానని మాట ఇచ్చిన ప్రభుత్వం ఆ మాట నిలబెట్టుకునేలా చూడాలని ఈ సభతో ప్రభుత్వం బీసీలకు న్యాయం చేసే విధంగా ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోడకుంట రమేష్, గోపతి అన్వేష్ ,వడ్లకొండ మనోహర్, శివ పవన్, అఖిల్,ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.

Make the BC Congress a success

More articles

Latest article